![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -719 లో... శివన్నారాయణ కుటుంబంతో కలిసి గుడికి వెళ్తాడు. అక్కడ దక్షిణామూర్తి హోమం చేస్తూ కన్పిస్తాడు. నా కూతురు క్షేమం కోసం చేస్తున్నానని దక్షిణామూర్తి అంటాడు. ఇక శివన్నారాయణ, దక్షిణామూర్తి మధ్య ఎప్పటిలాగే మాటల యుద్ధం జరుగుతుంది మాలినిని చూసి కార్తీక్ ఎవరని అడుగుతుంది. తను నా కోడలు అని దక్షిణామూర్తి చెప్తాడు. బాగున్నావా సుమిత్ర అని మాలిని అడుగుతుంది. సుమిత్ర సైలెంట్ గా ఉంటుంది. ఏం మేనకోడలు ఎలా ఉన్నావని జ్యోత్స్నని మాలిని అడుగుతుంది. అలా అందరిని మాలిని బంధంతో పిలుస్తుంది కానీ శివన్నారాయణ మాత్రం అవేం వద్దని ఇంకొకసారి ఎదురుపడొద్దని వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత మీ కూతురు మీకు దగ్గర అవ్వాలని హోమం జరిపించాను.. మీకు ఎదురు పడిందని దక్షిణామూర్తితో మాలిని అంటుంది. త్వరలోనే మీరు ఒకటి అవుతారు మావయ్య అని మాలిని చెప్తుంది. మరొకవైపు జ్యోత్స్న, సూరజ్ నవగ్రహ పూజ దగ్గరికి వస్తాడు. మీరు భార్యాభర్తలు జంటగా వచ్చారు. పూజ చేసుకోండి అని పంతులు అనగానే పంతులు మేం జంట కాదు మీకు తెలియదా అని జ్యోత్స్న కోప్పడుతుంది. దాంతో తప్పు అయింది అమ్మ అని పంతులు అంటాడు. జ్యోత్స్న వెనకాలే సూరజ్ వస్తాడు. తను ఏం చేసినా సూరజ్ అదే చేస్తాడు. అదంతా పారిజాతం చూసి వీడు మాములోడు కాదని అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి శివన్నారాయణలాగా మిమిక్రీ చేసి తనని ఆటపట్టిస్తాడు.
మరొకవైపు దీప అందరికి ప్రసాదం ఇస్తుంది. అక్కడే మాలిని ఉంటుంది. తనకి కూడా ప్రసాదం ఇస్తుంది. మాలిని ప్రసాదం తింటూ చాలా బాగుంది. మా రెస్టారెంట్ లో చెఫ్ గా చేస్తావా.. శాలరీ నువ్వు అన్నంత ఇస్తానని అంటుంది లేదు అండి అని దీప అంటుందంటే వంటమనిషిగా ఎక్కడైనా చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇచ్చి.. తను నా భార్య దీప జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ అని చెప్తాడు. ఆ విషయం తనకి తెలియదనుకుంటున్నావా అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ దీప ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |